Your Ad Here

Saturday, May 8, 2010

అమ్మ..



"అమ్మ" అనే పిలుపులొనే ఉంది కదా యెనలేని కమ్మదనం..!!

అవును మరి...

నవ మాసాలు మొసినా ,జోల పాట పాడినా ,

చీవాట్లు పెట్టినా..,గోరు ముద్దలు తిని పెట్టినా..

మన తఫ్ఫులు వెనకేసుకొచ్చినా ,మన కోసం తల్లడిల్లినా..

అన్నింటికి "అమ్మే" ఆది..తనే మన ప్రగతికి పునాది


మరి మాతృదేవత నిబ్రహ్మ” ఎలా సృస్టించాడో తెలుసా ??


సమస్త సృస్టి భారం వహిస్తున్న 'భూదేవి సహనాన్ని '..

అనంత విశ్వ కొటిని అక్కున చేర్చుకున్న 'ఆకాశపు విశాల హ్రుదయాన్ని '..

వంచించిన కొద్దీ ప్రెమతొ నీడను పంచే 'వృక్ష సంపదల ఔదార్యాన్ని '..

ఆందొలనలను దూరం చేస్తూ,అహ్లాదాన్ని పంచే చల్లని వెన్నెల ఒడిని

మాటలకందని మధురానుభూతుల్ని మది లొ ముద్రించే 'ప్రకృతి సౌందర్యాన్ని…'

దారంతా రాళ్ళున్నా గలా గలా పారెటి సెలయేటి సంతోషాన్ని..

కలగలిపి కమనీయ రూపానికి ప్రాణ ప్రతిస్ఠ చెసాడు భగవంతుడు..

అలా ముర్తీభవించిన మమకార మూర్తి కిఅమ్మఅని పేరు పెట్టాడు..


కనిపించని దేవుడు కేవలం "అమృతం" తో సరిపెట్టుకుని!

కని పెంచమని "అమ్మ" ని మనకోసం నేలకు పంపాడు!!

అంతటి అమూల్యమైన కానుకని..మనం సదా ప్రేమించాలని కోరుకుంటూ

ప్రపంచంలో మాతృమూర్తులందరికి "మదర్స్ డే" శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక వందనాలు!!

Mom..Love you Forever and Ever!!


3 comments:

Mr. Nallapati said...

very good one kumar!!

Unknown said...

Nice Post Kumar, moved my heart.

Srinivas Angara said...

Superb...chakri..no words..even the "nanna" poem also..touching..dude..