అరె...చూస్తూ చూస్తూనే మరో ఏడాది గడిచిపొయింది...ఆమ్మో పేరుకు తగ్గట్టుగానే ఈ "వికృతి" సంవత్సరం చాలా వికారంగానే గడిచింది ...రాష్ట్రంలో గొడవలు ..అసెంబ్లిలో అల్లర్లు ..జపాన్ లో సునామిలు ...ఇలా మనల్ని అనుక్షణం భయపెడుతూ మొత్తానికి వెళిపోతోంది...
జరిగిందేదో జరిగింది...ఈ క్రొత్త సంవత్సరం జరగబోయే మంచికి శుభసూచకంగా, గత 27 యేళ్ళుగా ఊరిస్తున్న ప్రపంచ కప్పు మన సొంతమయ్యింది ..
ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని..మన ఆశలు అన్ని నెరవేరాలని కోరుకుంటూ ఈ శ్రీ ఖర నామ సంవత్సరాన్ని ప్రారంభిద్దాం ...
అలాగే ఫ్రెండ్స్ అందరికి ఉగాది శుభకాంక్షలతో ఈ చిరు కవిత
పెదాలపై చెరగని చిరునవ్వులు....
ప్రేమతో నిండిన పలకరింపులు...
ద్వేషాలు తెలియని హృదయాలు..
చేయూత నిచ్చే సహాయాలు...
విభజనలతో విడిపొని స్నేహాలు..
డబ్బులతో ముడిపడని బంధాలు..
విజయాలు చేసే సంతకాలు..
గతాలు పంచే ఙాపకాలు..
ఓటమి నేర్పే గుణపాఠాలు
గెలుపు కోసం ఆరాటాలు..
ఎల్లప్పుడు మంచి ఆలోచనలు..
అత్యున్నత శిఖారాలను అధిరోహించే కాంక్షలు
మన వెన్నంటే ఉంటే..
విచ్చేసే ప్రతి వసంతం వరాల జల్లే
మామిడి పూతల,కోకిల కూతల ఈ శ్రీ ఖర యుగాది రంగుల హరివిల్లే