if Reading font is difficult try this image version for Telugu
ఎన్ని సార్లు విన్నా …ఎన్ని సార్లు చూసినా…ఇప్పటికీ నవ్యంగా, యెప్పటికీ రసరమ్యంగా ఉండె మహాకావ్యం…“రామాయణం”. ఆ దివ్య కావ్యం ఆధారంగా యెన్నో పౌరాణికాలు…ఇంకెన్నొ సాంఘికాలు వచ్చాయి, మనల్ని మెప్పించాయి…వాటిల్లో ప్రప్రధమంగా చెప్పుకునేది…”లవకుశ” గురించి. యెన్ని యుగాలైన తరగని మేలిమి వజ్రం ఆ చిత్రం. “సంపూర్ణ రామయణం” మొదలుకొని “ముత్యాల ముగ్గు” “శ్రీ రామంజనేయ యుద్దం” ఇలా రామయణాన్ని కాసి వడపోసిన బాపు గారు అలనాటి “లవకుశ” ని నేటి తరానికి కానుకివ్వాలనే సత్సంకల్పం తో తీసిన సినిమా “శ్రీ రామ రాజ్యం”. యలమంచలి సాయి బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి రాముడు ఇంకెవరైయుంటారు….తండ్రి అడుగుజాడల లో మరో అడుగు ముందుకెస్తూ ఈ సాహసానికి పూనుకున్న నందమూరి బాలకృష్ణ…
లవకుశుల కథ: రావణ సంహారం కావించి సీతా సమేతుడై అయొధ్య చేరిన రాముడు, ఎంతో జనరంజకంగా రాజ్యాన్ని పాలిస్తాడు. ఓ చాకలి వాడి నిందలు విన్న రాముడు, గర్భవతి గా ఉన్న సీతని అడవులకు పంపిస్తాడు. రామాయణ గ్రంధ కర్త వాల్మికి ఆశ్రమం లో సీతా దేవి లవకుశులను ప్రసవిస్తుంది. చివరగా ఆ చిన్నారులను తండ్రి వద్దకు ఎలా చేరారు? సీతా రాముల అవతారాలు ఎలా పరిసమాప్తం అయ్యాయి అనేది ముఖ్య కథ.
కట్టే కొట్టే తెచ్చే అని మూడు ముక్కల్లో రామయణాన్ని చెప్పేసుకుంటాం, కాని అసలు గుండెలు పిండె కథ ఆ తరువాతే కథ మొదలు..!!
నటీనటులు…
బాలకృష్ణ…నట జీవితంలొ కలికితురాయి శ్రీ రామ పాత్ర. ఆ మహానుభావుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి కొడుకుగా పుట్టిన ౠణాన్ని ఈ విధంగా తీర్చుకునే అవకాశం బాలకృష్ణ కి దక్కింది అని చెప్పొచు. ఆ అవకాశాన్ని తన వంతుగా నెరవేర్చారు బాలయ్య. ఎంతో ఇష్టంగా, నిష్టగా చెసారు కాబట్టి ఎన్నో సార్లు ఎన్.టీ.ఆర్ ని గుర్తు చెస్తూ అద్భుతంగా సాగింది రాముడి పాత్ర. ముఖ్యంగా సీత మీద ఉన్న ప్రేమ ఆ కళ్ళల్లొ బాగా చూపించాదు బాలకృష్ణ.
శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు వాల్మీకి పాత్ర పొషించడం శ్రీరామరాజ్యం సినిమాకే వన్నె తెచ్చింది. నాగయ్య గారిని మరిపించగల సత్తా మరి ఆయనకే ఉంది.
సీతమ్మ అంటె యెప్పటికి అంజలి దేవి గారే. నిజంగా సీతమ్మ తల్లి దిగొచ్చారా అనిపిస్తుంది ఆమెని చూస్తే! కావున పొలిక వ్యర్ధం. అయినా నయనతార బాలయ్య కి సరిజొడు గా సీత పాత్రలో ఇమిడిపొయింది. ఆత్యంత కీలకమయిన ఈ పాత్రలో నయనతార చాలా బాగా చేసింది అని చెప్పొచు…నయనతార సీత ఎంటి? అన్న వారందురు...శభాష్ నయనతార అంటారు ఖచ్చితంగా..!!
లవకుశులుగా చిన్నారులిద్దరు సినిమా ఇంకా ముద్దొచెలా చేసారు...రామాయణ కథ చెప్పే పాటల్లో మురిపించారు.
తన సినీజీవితం లొ అందరి హీరోలకు సహయ పాత్రలు చేసిన శ్రీకాంత్ కి లక్షమనుడి పాత్ర అచ్చంగా సరిపొయింది. కాంతారావు గారు చేసిన పాత్రని చక్కగా పొషించాడు శ్రీకాంత్.
కౌసల్య గా కేఆర్ విజయ మెప్పించారు. కన్నాంబ పొషించిన పాత్ర ఇది.
ధారా సింగ్ కి ఆంజనేయ పాత్ర కొట్టిన పిండి. అలాగె ఆంజనెయుడు ఒక బాలుడి రూపం లొ రావటం కొత్తగా బాగుంది. భూదేవి పాత్రలో రోజా కావాల్సిన రౌద్రాన్ని ప్రదర్శించింది. భరతుడి గా సమీర్,జనకునిగా మురళి మోహన్, చాకలి తిప్పన గా బ్రహ్మానందం, వశిష్టుని గా సీనియర్ బాలయ్య సరిపొయారు.
లవకుశ లో రేలంగి,సుర్యాకాంతం,రమణారెడ్డి గారు లేని లోటు కనిపిస్తుంది.
ఇళయరాజా సంగీతం అత్యధ్బుతం
జగదానంద కారక....జానకి చంద్ర నాయక...అంటూ బాలు సీతరాములను స్వాగతిస్తూ పాడే పాటతో సినిమా ఆరంభం అవుతుంది.. "యే నిమిషానికి యెమి జరుగునో" అనె పాట తెలీని వారుండరెమో...ఆ సందర్భం లో వచ్చే "గాలి నింగి నీరు " ని సగానికి కుదించారు..:(."సీతా సీమంతం " చూడటానికి కనువిందు చేస్తుంది
ఇక రామయణాన్ని వర్ణించే మూడు పాటాలు "దేవుళ్ళె మెచ్చింది ...మీకెంతో నచ్చింది..శ్రీ సీతా రామ కథ ", "రామయణము..శ్రీ రామయణము..." , "సీతా రామ చరితం" మూడు ఆణిముత్యాలు. శ్రేయ ఘోషల్ గాత్రం చాలా మధురం గా ఉంది ఈ పాటల్లొ. జొన్నవిత్తుల గారు అన్ని పాటలు చాలా చిన్ని చిన్ని పదాలతో చాలా బాగా రాశారు.బాపు సంతకం అన్ని పాటల్లొ స్పష్టంగా కనిపిస్తుంది.
బాపు రమణీయం చిరస్మరణీయం !!
కమ్మని పదాలతో శ్రీ రామరాజ్యాన్ని రసరమ్యం చేసిన ముళ్ళపూడి రమణ గారు మన మధ్య లేరు అంటే బాధ గా ఉంది. వారి స్మృతులతో వారికి అంకితమిస్తూ ఆనాటి లవకుశ కి తనదైన ముద్ర వేసారు బాపు గారు. నిజానికి లవకుశ లో చాలా కష్టమయిన సన్నివేశాలు ఉన్నాయి. బాపు తెలివి గా చాలా వరకు కుదించి పాటలతో కథని నడిపించాడు.
లక్షమనుడు సీతని అడవిలో దింపిన సన్నివేశం, రాముని మీద అనుమానం తో సీత అయొధ్య కి వచ్చే సన్నివేశం, రాముడిని లవకుశులు ఎదిరించే సన్నివేశం, ఒకటా రెండా. ఇలా చాలా సన్నివేశాలు బాపు హ్రుద్యంగా తెరకెక్కించాడు. ప్రతి సన్నివెశం ఒక అందమైన బొమ్మలా కళ్ళ ముందు ఉంది అంటే అది ఆర్ట్ డైరెక్టర్ రవీందర్, సినిమాటొగ్రఫర్ పి.ఆర్.కె రాజుల కృషి ఎంతో ఉంది. గ్రాఫిక్స్ కూడ చాల సహజంగా ఉన్నాయి.
తప్పక చూడాలి...
లవకుశ మళ్ళీ తీయటం అసంభవం. కాని నేటి తరానికి రామయణం రుచి చూపించాలని చేసిన ఈ చిరు ప్రయత్నం నిజంగా హర్షనీయం.మొదటి బాగంలొ కొన్ని హెచ్చు తగ్గులున్నా రెండవ బాగం చాలా బాగుంది. ఒక మంచి చిత్రం గా నిలిచిపొతుంది శ్రీరామరాజ్యం
సంతృప్తి శాతం!!
4/5
2 comments:
తెలుగు లో వ్రాసిన సమీక్ష చాలా బాగుంది. చక్కగా ఇలా తెలుగు సినిమాలకి సమీక్ష తెలుగులో వ్రాస్తే బాగుంటుంది.
chala bagundhi chakri garu mee sameeksha...
Post a Comment