Your Ad Here

Saturday, June 19, 2010

నాన్న ...


తొమ్మిది నెలలు తన కడుపు లో పెట్టుకుని మనని మోసెది అమ్మైనా..

మనం అమ్మ కడుపులొ పడ్డ క్షణం నుంచి ..భూమ్మీద పడేంత వరకు నాన్న పడే ఆతృత ,ఆందోళన ..తీసుకునే జాగ్రత్త,శ్రద్ద బహుసా తండ్రైతే కాని తేలిదెమో..!!

అంతటితో సరిపొతుందా ..అప్పుడే కదా మొదలు ...!పాల పీక నుంచి ఆట బొమ్మలు దాక ...స్కూలు బుక్స్ నుంచి మన కాలేజి ఫీజు దాక అన్ని ఆయన దగ్గరుండి సమకూర్చాల్సిందే..

మనకోసం ఎంతో ఇష్టంగా చెసేవన్ని చేస్తూ పైకి కాస్తంత కటువుగా కనిపిస్తాడు..అవును మరి గారాబం చేస్తే మనం గాడి తప్పుతామని భయం కాబోలు !!అందుకే అమ్మ దగ్గరున్న చనువు నాన్న దగ్గర ఉండదు ....చనువు లేకపొతేనెం చచ్చెంత ప్రేమ ఉందిగా నాన్న మీద...అలా లోలోపల దాగున్న ఇష్టానికి అక్షర రూపమే చిరు కవిత ..

గుర్తున్నాయి నాన్న..

మీ గుండె తొక్కుతూ వేసిన నా తొలి అడుగులు..

మీ వీపు పై ఊరెగుతూ చేసిన గుర్రపు స్వారీలు...

నే పడకుండా పట్టుకున్న నా చిటికెన వేలు...

మీ చేతితో దిద్దించిన జీవితపు తొలి ఓనమాలు..

నిదరోయె వేళ మీరు చెప్పిన కమ్మని కధలు ..

మా భవితకై పరితపించిన ప్రతి రాత్రి పగలు..

మీ పుణ్యమే నాన్న..

పైసా విలువ తెలీకున్నా దర్జాగా పెరిగా పాతికేళ్ళు...

ప్రతి మలుపులో ముళ్ళున్నా పూలపై నడిచా ఇన్నాళ్ళు !!

మీ కష్టార్జీతం తో రెక్కలు తొడిగాయి నా కలలు..

మీ ప్రోత్సాహ ఫలితమే నే సాధించిన విజయాలు..

నిజం చెప్పనా నాన్న..

మీ మనవడికి నిను మించిన నాన్నని నే కాలేను..

జన్మకి ఏమిచ్చినా మీ ౠనం తీర్చుకోలేను ...

అలాగని

"మరు జన్మంటూ ఉంటే" అని కాకమ్మ కబుర్లు చెప్పను..

మీ జీవన సంధ్యలొ మీ ధ్యాస నే మరువను..

4 comments:

Unknown said...

awesome article dude....keep up the good work

Mahesh said...

Chala bagundi........good work[:D]

Mahesh said...

Good work.....keep it up[:D]

Srinivas Angara said...

Hey chakri...u r even very good at telugu..awesome..no words..touched my heart...