Sunday, April 3, 2011
శ్రీ ఖర నామ యుగాది శుభాకాంక్షలు
Saturday, June 19, 2010
నాన్న ...

తొమ్మిది నెలలు తన కడుపు లో పెట్టుకుని మనని మోసెది అమ్మైనా..
మనం అమ్మ కడుపులొ పడ్డ ఆ క్షణం నుంచి ..భూమ్మీద పడేంత వరకు నాన్న పడే ఆతృత ,ఆందోళన ..తీసుకునే జాగ్రత్త,శ్రద్ద బహుసా తండ్రైతే కాని తేలిదెమో..!!
అంతటితో సరిపొతుందా ..అప్పుడే కదా మొదలు ...!పాల పీక నుంచి ఆట బొమ్మలు దాక ...స్కూలు బుక్స్ నుంచి మన కాలేజి ఫీజు దాక అన్ని ఆయన దగ్గరుండి సమకూర్చాల్సిందే..
మనకోసం ఎంతో ఇష్టంగా చెసేవన్ని చేస్తూ పైకి కాస్తంత కటువుగా కనిపిస్తాడు..అవును మరి గారాబం చేస్తే మనం గాడి తప్పుతామని భయం కాబోలు !!అందుకే అమ్మ దగ్గరున్న చనువు నాన్న దగ్గర ఉండదు ....చనువు లేకపొతేనెం చచ్చెంత ప్రేమ ఉందిగా నాన్న మీద...అలా లోలోపల దాగున్న ఇష్టానికి అక్షర రూపమే ఈ చిరు కవిత ..
గుర్తున్నాయి నాన్న..
మీ గుండె తొక్కుతూ వేసిన నా తొలి అడుగులు..
మీ వీపు పై ఊరెగుతూ చేసిన గుర్రపు స్వారీలు...
నే పడకుండా పట్టుకున్న నా చిటికెన వేలు...
మీ చేతితో దిద్దించిన జీవితపు తొలి ఓనమాలు..
నిదరోయె వేళ మీరు చెప్పిన కమ్మని కధలు ..
మా భవితకై పరితపించిన ప్రతి రాత్రి పగలు..
మీ పుణ్యమే నాన్న..
పైసా విలువ తెలీకున్నా దర్జాగా పెరిగా పాతికేళ్ళు...
ప్రతి మలుపులో ముళ్ళున్నా పూలపై నడిచా ఇన్నాళ్ళు !!
మీ కష్టార్జీతం తో రెక్కలు తొడిగాయి నా కలలు..
మీ ప్రోత్సాహ ఫలితమే నే సాధించిన విజయాలు..
మీ మనవడికి నిను మించిన నాన్నని నే కాలేను..
ఈ జన్మకి ఏమిచ్చినా మీ ౠనం తీర్చుకోలేను ...
అలాగని
"మరు జన్మంటూ ఉంటే" అని కాకమ్మ కబుర్లు చెప్పను..
మీ జీవన సంధ్యలొ మీ ధ్యాస నే మరువను..
Saturday, May 8, 2010
అమ్మ..

"అమ్మ" అనే ఆ పిలుపులొనే ఉంది కదా యెనలేని కమ్మదనం..!!
అవును మరి...
నవ మాసాలు మొసినా ,జోల పాట పాడినా ,
చీవాట్లు పెట్టినా..,గోరు ముద్దలు తిని పెట్టినా..
మన తఫ్ఫులు వెనకేసుకొచ్చినా ,మన కోసం తల్లడిల్లినా..
అన్నింటికి "అమ్మే" ఆది..తనే మన ప్రగతికి పునాది
మరి ఆ మాతృదేవత ని “బ్రహ్మ” ఎలా సృస్టించాడో తెలుసా ??
సమస్త సృస్టి భారం వహిస్తున్న 'భూదేవి సహనాన్ని '..
అనంత విశ్వ కొటిని అక్కున చేర్చుకున్న 'ఆకాశపు విశాల హ్రుదయాన్ని '..
వంచించిన కొద్దీ ప్రెమతొ నీడను పంచే 'వృక్ష సంపదల ఔదార్యాన్ని '..
ఆందొలనలను దూరం చేస్తూ,అహ్లాదాన్ని పంచే చల్లని వెన్నెల ‘ఒడి’ ని
మాటలకందని మధురానుభూతుల్ని మది లొ ముద్రించే 'ప్రకృతి సౌందర్యాన్ని…'
దారంతా రాళ్ళున్నా గలా గలా పారెటి సెలయేటి సంతోషాన్ని..
కలగలిపి కమనీయ రూపానికి ప్రాణ ప్రతిస్ఠ చెసాడు భగవంతుడు..
అలా ముర్తీభవించిన మమకార మూర్తి కి “అమ్మ” అని పేరు పెట్టాడు..
కనిపించని ఆ దేవుడు కేవలం "అమృతం" తో సరిపెట్టుకుని!
కని పెంచమని ఆ "అమ్మ" ని మనకోసం నేలకు పంపాడు!!
అంతటి అమూల్యమైన కానుకని..మనం సదా ప్రేమించాలని కోరుకుంటూ
ఈ ప్రపంచంలో మాతృమూర్తులందరికి "మదర్స్ డే" శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక వందనాలు!!
Mom..Love you Forever and Ever!!
Tuesday, May 4, 2010
Srinivaasa Kalyanam: NewJersey

సాక్షాత్తు శ్రీ రంగనాధుడు..'సిరీ'భూ' దేవి సమెతులై న్యూజెర్సీ విచ్చెసాడు..
ఏడు కొండలపై నివాసముండే రమా నాధుడు..అమెరికా దేశాన్ని పావనం చెసాడు
కని విని యెరుగని ఆ కళ్యాణ వైభొగం తో ఇక్కడి వారందరిని తరింప చెసాడు..
ఆద్యంతం ఆసక్తి దాయకంగా జరిగిన శ్రీమన్నారాయుని కళ్యాణ విశేషాలు మీ కోసం..
2010 మే 1వ తారిఖు ..మొర్గన్ విల్లె, న్యూజెర్సీ లొ శ్రీ వారి వివాహ మహోత్సవం జరిగింది ..
ఆ రొజంతా అక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది..
ఆడవారంతా పట్టు చీరలతో మగవారంతా పట్టుపంచెలు..షేర్వాణిలతో ఆ మండపానికి మరింత శొబగులు అద్దారు
ఆంతా చూస్తుంటే మన తెలుగు నాట జరిగే సంప్రదాయమైన పెళ్ళి సందడి లా ఉంది..
మరి అక్కడ జరిగేది మాములు పెళ్ళా? శాక్షాత్తు శ్రీ.”శ్రీనివాసుని పెళ్ళి”సందడి..
ఫ్రొద్దున్నే సుప్రభాత సేవ తో స్వామి వారి సెవలు మొదలయ్యాయి..తరువాత అలంకారం జరిగింది..అప్పటికే కళ్యాణం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరు లైన్ లొ ఎదురు చూస్తున్నారు..
ముందు గా స్వామి వారిని ఊరెగించిన తరువాతే అందరిని కళ్యాణ మండపం లొకి అనుమతిస్తారు..
దాదాపు 9:30 కి ఊరెగింపు మొదలయ్యింది.వేద మంత్రాల ఉచ్చరణ తో,సన్నాయి మేళాలతొ ఆ పురుషొత్తముడిని పల్లకి లొ మండపం చుట్టూ ఊరెగించారు..విచ్చేసిన భక్తులందరు స్వామి వారి వెనకే నడుస్తూ కళ్యాణ మండపం లోకి చేరుకున్నారు. కళ్యాణం టికెట్లు తీసుకున్న వారందరు వారి వారి టికెట్ ఖరీదు ని బట్టి మూడు పంక్తులలొ కూర్చున్నారు..
ముందుగ కార్యక్రమ నిర్వాహకులు అందరికి స్వాగతాలు పలికారు..ముఖ్య పూజారులు.. కళ్యాణ విశిష్టతను సభ కి వివరించారు..తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసిన గాయకులు “బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మమొక్కటే””గొవింద గొవింద అని కొలువరే..” అంటూ పలు అన్నమయ్య కీర్తనలు, పాటలతో కళ్యాణ వేడుక ని ప్రారంభించారు..
కళ్యాణం లొని ముఖ్య ఘట్టాలైన పెళ్ళికొడుకుని స్వాగతించుట,అగ్ని హోత్రం,మధుపర్కాలు(బట్టలు పెట్టటం),మహా శంకల్పం,మాంగళ్య ధారన ,తలంబ్రాలు,ఫూర్నాహుతి..ఇలా అన్ని ఎంతో చక్కగా వివరిస్తూ అత్యంత శ్రద్దా భక్తులతో నిర్వహించారు..
మధ్య మధ్యలొ “పిడికెడు తలంబ్రాల పెళ్ళి కూతురు..””చూడరమ్మ సతులార..” ఇలా మరికొన్ని అన్నమయ్య కీర్తనలు..పసందైన పాటలు విచ్చేసిన వారికి ఉత్తేజాన్ని పంచాయి.
అలాగె సినీ గేయ రచయిత జొన్నవిత్తుల గారు రాసి ఆలపించిన “విమాన వేంకటనాధుడు..ఎయిర్ ఇండియా విమానమెక్కి విదేశమొచ్చాడు..” అంటూ సాగిన పాట అందరిని అలరించింది.
ఆ తరువాత అందరికి అన్నదానం అంటే మహాప్రసాదం పంచారు ..
సర్వదర్శనం దాదాపు సాయంత్రం 6-7 దాక జరుగుతూనే ఉంది..గురువాయప్పన్ మందిరం లొ పార్కింగ్ సరిపొదు కనుక అందరికి వొనేజ్ ఆఫిసు దగ్గర పార్కింగ్ ఇవ్వటం జరిగింది.అక్కడనుచి కళ్యాణ మండపానికి బస్సులు తిరిగాయి..
ఇక ఎంతో మంది వాలంటీర్లు ఎన్నో రోజుల ముందు నుంచి యెర్పాటులు చూసుకున్నారు ..
అలాగే శనివారం రోజు రిజిస్ట్రేషన్ దగ్గరనుంచి..అన్నదాన కార్యక్రమం దాక అన్ని పనుల్లొ చురుగ్గా పాల్గొని శ్రీనివాసునికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు..
ఈ మహత్తర కార్యాన్ని తలపెట్టిన ప్రముఖులు ,వేదికనలంకరించిన అర్చకులు ,సాయమందించిన వాలంటీర్లు ..విచ్చేసిన భక్తులు నిజంగా ధన్యులయారు!!
కన్నుల పండువగ జరిగిన కలియుగ దేవుని కళ్యాణ వైభొగం
సమస్తం రమణీయం,స్మ్రుతి పధం లొ చిరస్మరణీయం..
Sunday, March 14, 2010
శ్రీ వికృతి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు!!

