Your Ad Here
Showing posts with label POEM. Show all posts
Showing posts with label POEM. Show all posts

Sunday, April 3, 2011

శ్రీ ఖర నామ యుగాది శుభాకాంక్షలు


అరె...చూస్తూ చూస్తూనే మరో ఏడాది గడిచిపొయింది...ఆమ్మో పేరుకు తగ్గట్టుగానే ఈ "వికృతి" సంవత్సరం చాలా వికారంగానే గడిచింది ...రాష్ట్రంలో గొడవలు ..అసెంబ్లిలో అల్లర్లు ..జపాన్ లో సునామిలు ...ఇలా మనల్ని అనుక్షణం భయపెడుతూ మొత్తానికి వెళిపోతోంది...
జరిగిందేదో జరిగింది...ఈ క్రొత్త సంవత్సరం జరగబోయే మంచికి శుభసూచకంగా, గత 27 యేళ్ళుగా ఊరిస్తున్న ప్రపంచ కప్పు మన సొంతమయ్యింది .. 
ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని..మన ఆశలు అన్ని నెరవేరాలని కోరుకుంటూ ఈ శ్రీ ఖర నామ సంవత్సరాన్ని ప్రారంభిద్దాం ... 
అలాగే ఫ్రెండ్స్ అందరికి ఉగాది శుభకాంక్షలతో ఈ చిరు కవిత 

పెదాలపై చెరగని చిరునవ్వులు....
ప్రేమతో నిండిన పలకరింపులు...

ద్వేషాలు తెలియని హృదయాలు..
చేయూత నిచ్చే సహాయాలు...

విభజనలతో విడిపొని స్నేహాలు..
డబ్బులతో ముడిపడని బంధాలు..

విజయాలు చేసే సంతకాలు..
గతాలు పంచే ఙాపకాలు..

ఓటమి నేర్పే గుణపాఠాలు
గెలుపు కోసం ఆరాటాలు..

ఎల్లప్పుడు మంచి ఆలోచనలు..
అత్యున్నత శిఖారాలను అధిరోహించే కాంక్షలు

మన వెన్నంటే ఉంటే..
విచ్చేసే ప్రతి వసంతం వరాల జల్లే
మామిడి పూతల,కోకిల కూతల ఈ శ్రీ ఖర యుగాది రంగుల హరివిల్లే

Saturday, June 19, 2010

నాన్న ...


తొమ్మిది నెలలు తన కడుపు లో పెట్టుకుని మనని మోసెది అమ్మైనా..

మనం అమ్మ కడుపులొ పడ్డ ఆ క్షణం నుంచి ..భూమ్మీద పడేంత వరకు నాన్న పడే ఆతృత ,ఆందోళన ..తీసుకునే జాగ్రత్త,శ్రద్ద బహుసా తండ్రైతే కాని తేలిదెమో..!!

అంతటితో సరిపొతుందా ..అప్పుడే కదా మొదలు ...!పాల పీక నుంచి ఆట బొమ్మలు దాక ...స్కూలు బుక్స్ నుంచి మన కాలేజి ఫీజు దాక అన్ని ఆయన దగ్గరుండి సమకూర్చాల్సిందే..

మనకోసం ఎంతో ఇష్టంగా చెసేవన్ని చేస్తూ పైకి కాస్తంత కటువుగా కనిపిస్తాడు..అవును మరి గారాబం చేస్తే మనం గాడి తప్పుతామని భయం కాబోలు !!అందుకే అమ్మ దగ్గరున్న చనువు నాన్న దగ్గర ఉండదు ....చనువు లేకపొతేనెం చచ్చెంత ప్రేమ ఉందిగా నాన్న మీద...అలా లోలోపల దాగున్న ఇష్టానికి అక్షర రూపమే ఈ చిరు కవిత ..

గుర్తున్నాయి నాన్న..

మీ గుండె తొక్కుతూ వేసిన నా తొలి అడుగులు..

మీ వీపు పై ఊరెగుతూ చేసిన గుర్రపు స్వారీలు...

నే పడకుండా పట్టుకున్న నా చిటికెన వేలు...

మీ చేతితో దిద్దించిన జీవితపు తొలి ఓనమాలు..

నిదరోయె వేళ మీరు చెప్పిన కమ్మని కధలు ..

మా భవితకై పరితపించిన ప్రతి రాత్రి పగలు..

మీ పుణ్యమే నాన్న..

పైసా విలువ తెలీకున్నా దర్జాగా పెరిగా పాతికేళ్ళు...

ప్రతి మలుపులో ముళ్ళున్నా పూలపై నడిచా ఇన్నాళ్ళు !!

మీ కష్టార్జీతం తో రెక్కలు తొడిగాయి నా కలలు..

మీ ప్రోత్సాహ ఫలితమే నే సాధించిన విజయాలు..

నిజం చెప్పనా నాన్న..

మీ మనవడికి నిను మించిన నాన్నని నే కాలేను..

ఈ జన్మకి ఏమిచ్చినా మీ ౠనం తీర్చుకోలేను ...

అలాగని

"మరు జన్మంటూ ఉంటే" అని కాకమ్మ కబుర్లు చెప్పను..

మీ జీవన సంధ్యలొ మీ ధ్యాస నే మరువను..

Saturday, May 8, 2010

అమ్మ..



"అమ్మ" అనే ఆ పిలుపులొనే ఉంది కదా యెనలేని కమ్మదనం..!!

అవును మరి...

నవ మాసాలు మొసినా ,జోల పాట పాడినా ,

చీవాట్లు పెట్టినా..,గోరు ముద్దలు తిని పెట్టినా..

మన తఫ్ఫులు వెనకేసుకొచ్చినా ,మన కోసం తల్లడిల్లినా..

అన్నింటికి "అమ్మే" ఆది..తనే మన ప్రగతికి పునాది


మరి ఆ మాతృదేవత ని “బ్రహ్మ” ఎలా సృస్టించాడో తెలుసా ??


సమస్త సృస్టి భారం వహిస్తున్న 'భూదేవి సహనాన్ని '..

అనంత విశ్వ కొటిని అక్కున చేర్చుకున్న 'ఆకాశపు విశాల హ్రుదయాన్ని '..

వంచించిన కొద్దీ ప్రెమతొ నీడను పంచే 'వృక్ష సంపదల ఔదార్యాన్ని '..

ఆందొలనలను దూరం చేస్తూ,అహ్లాదాన్ని పంచే చల్లని వెన్నెల ‘ఒడి’ ని

మాటలకందని మధురానుభూతుల్ని మది లొ ముద్రించే 'ప్రకృతి సౌందర్యాన్ని…'

దారంతా రాళ్ళున్నా గలా గలా పారెటి సెలయేటి సంతోషాన్ని..

కలగలిపి కమనీయ రూపానికి ప్రాణ ప్రతిస్ఠ చెసాడు భగవంతుడు..

అలా ముర్తీభవించిన మమకార మూర్తి కి “అమ్మ” అని పేరు పెట్టాడు..


కనిపించని ఆ దేవుడు కేవలం "అమృతం" తో సరిపెట్టుకుని!

కని పెంచమని ఆ "అమ్మ" ని మనకోసం నేలకు పంపాడు!!

అంతటి అమూల్యమైన కానుకని..మనం సదా ప్రేమించాలని కోరుకుంటూ

ఈ ప్రపంచంలో మాతృమూర్తులందరికి "మదర్స్ డే" శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక వందనాలు!!

Mom..Love you Forever and Ever!!


Sunday, March 14, 2010

శ్రీ వికృతి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు!!


నా స్నేహితులందరికి హ్రుదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు...
జనవరి తో మన క్యాలెండర్ మోదలైనా..మన తెలుగువారికి మాత్రం ఉగాదే సరైన సంవత్సరాది..
ఈ నూతన సంవత్సరం పేరు "వికృతి". పేరు తలుచుకుంటెనే కొంచెం కంగారు పుట్టిస్తుంది కదూ!!
పేరుకు తగ్గట్టుగానె పంచాంగం ప్రకారం కాస్తంత ఇబ్బందిగానే ఉంటుందట ఈ యేడాది...
ఎదైతెనేం జీవితం లో అన్ని రకాలైన కష్టసుఖాలను ఓర్చుకుంటూ ముందుకు సాగాలని కొరుకుంటూ
షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తో మన తొలి రోజు ప్రారంభిద్దాం..
అలాగే నా ఫ్రెండ్స్ కోసం ఒక చిన్ని కవిత ...

తరతరాలకు తరగని చెలిమి లొని ‘తీపి’ని
కష్టసుఖాల్లొ తొడుగ నిలిచిన 'ఉప్ప'టి కన్నిటిని..
'నేస్తమా' అని పలకరించే మన స్నేహితుల పిలుపు లోని 'పులుపు'ని..
గతం చేసిన గాయాలు మిగిల్చిన బాధ లోని ‘చేదు’ని..
అప్పుడప్పుడు మనలో గూడు కట్టుకునే పొగరు లొని ‘వగరు’ని..
మన మేలు కోరే ఆత్మీయులు పంచే మమ 'కారా'న్ని..
కలగలిపి పుచ్చుకుందాం షడ్రుచుల ఉగాది పచ్చడిని..
ఈ యుగాది ..అలాగే..ఈ యెడాది తీయ తీయగ సాగాలని మనసార కొరుకుంటూ ..
శ్రీ వికృతి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు...

Friday, February 26, 2010

A Tribute to Tendulkar


Sachin’s extraordinary double ton has bought smiles on our faces. Everyone in India are proud that an Indian Batsman was first to score 200 in 1-day match. That too it being achieved by Sachin doubled the happiness. We all know that Apart from his Excellency, It is also his attitude and sportsmanship that won him lakhs of fans all over the world.

Here is a small poem in Telugu written by me on Sachin tendulkar to celebrate his success.


జయహో! జయహో!! సచిన్ టెండూల్కర్

జగమంతటిలో నువ్వే 'ది బెస్ట్ క్రికెట్ ప్లేయర్ '


మైదానంలో 'నిలబడి'తే చాలు పరుగుల వరద.

ప్రత్యర్దులకు దఢ పుట్టించడం నీకు మహ సరదా


200 పరుగులు అలవొకగ సాధించిన క్రికెట్ రారాజు!

మరో 200 యేళ్ళయిన తరగదెమో కుర్రకారులో నీకున్న క్రేజు!!

కాబట్టెగా..

గులామయ్యాయి నీ గమనం లో ఎన్నో రికార్డులు..

సలామన్నాయి నీ ప్రతిభకి అన్నే అవార్డులు..


విజయలెన్ని వరించినా నీలో రవ్వంతైన లేదెం గర్వం..

వీరభిమానులే 'సచిన్' నీకు ఈ విశ్వం సర్వం..


ఓటమికి లొంగని,గాయాలకి జడవని జగమొండి ఘటం!

వయసు మీద పడ్డా,విమర్శల పాలైనా ఆపలేదు పొరాటం!!


మరందుకేనయ్యా...నువ్వు

క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం..

తోటి యువతకు సాటిలేని ఆదర్శం..


క్రికెట్ ఉన్నంతకాలం నిలిచిపొతుంది 'సచిన్ టెండూల్కర్' నీ పేరు.

ఆజన్మాంతం నిను ప్రేమిస్తామని గుండె మీద చెయ్యెసి చెబుతున్నాం మరో మారు


By Chakri...